Thursday, May 2, 2024

ఆర్య‌వైశ్యుల అభివృద్ధికి ప్ర‌త్యేక ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్: ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా

వరంగల్ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. ఈ కార్య‌క్రమం వరంగల్, రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో నిర్వ‌హించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిరుపేద వైశ్య కుటుంబాల‌కు కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్య వైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంద‌ని, అన్ని రంగాలలో ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.

కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాజకీయంగా ఆర్యవైశ్యులకు రాష్ట్రంలో 4 కార్పొరేషన్ చైర్మన్లు, ఒకరికి MLC, ఒకరికి MLA, TTD బోర్డు సభ్యుడిగా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, 11 మందికి మున్సిపల్ చైర్మన్లు, దేవాలయాలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా అన్ని విధాలుగా అవకాశం క‌ల్పించిన‌ట్టు తెలిపారు.

తెలంగాణలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి TS ipass ద్వారా 15 రోజులలో అనుమతి ఇస్తున్నామ‌న్నారు.
అంతకు ముందున్న ప్రభుత్వాలు ఆర్యవైశ్యులను పట్టించుకున్న దాఖలాలు లేవని, 40 ఏండ్ల చరిత్ర తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అవకాశం కల్పించార‌న్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ బొల్లం సంపత్ కుమార్, GWMC కార్పొరేటర్ గందే కల్పన నవీన్, ఐవీఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేష్ బాబు, రైస్ మిల్లు అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్ కుమార్, ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తా, ఐవీఎఫ్ పొలిటికల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ బచ్చు శ్రీనివాస్, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, రాష్ట్ర ఐవీఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, మంజుల, వరంగల్ జిల్లా ఐవీఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలు వల్లాల శైలజ, ఐవీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement