Monday, April 29, 2024

తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయం.. 3.89కోట్లు

తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయం 3.89కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. రేపటి వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుందని వెల్లడించారు. కాగా ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శివం కాండివ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీలను సంస్థ ప్రతినిధులు తిరుపతికి చెందిన రాఘవేంద్ర తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న స్వామివారిని 56,003 మంది దర్శించుకోగా 20,365 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement