Saturday, April 27, 2024

AP | వెలిగొండ పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం.. జగన్ పై బీజేపీ ఆగ్రహం

పశ్చిమ ప్రకాశం, ప్రభ న్యూస్ : వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు, ఫీడర్ కెనాల్ నిర్మాణం, రిజర్వాయర్ ఏరియాల్లో లోపాలు, అసంపూర్తి పనులు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎలా మోసం చేశారో తేటతెల్లం అవుతుందని బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేర్కొంది. ఈ నెల 6న ఆ ప్రాజెక్టు పూర్తి కాకున్నా ప్రారంభోత్సవాలు చేయడం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడమే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.

కమిటీ సభ్యులు సుంకేసులలో పర్యటించినప్పుడు.. అక్కడి నిర్వాసితులకు పరిహారం అందడం లేదని, పునరావాసానికి ఎలాంటి సహకారం అందడం లేదని తేలింది. నిర్వాసితులకు 1400 కోట్లు పరిహారం ఇవ్వకుండానే.. ప్రాజెక్టును పూర్తి చేశారని ముఖ్యమంత్రి ఎలా చెప్పారో అర్థం కావడం లేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు చాలా ప్రాంతాలలో పూర్తి కాకపోవడం, నిర్వహణ లోపం వల్ల పూర్తి అయిన చోట్ల కూడా చాలవరకు పూడి పోవడం దౌర్భాగ్యమని అన్నారు.

వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామం సుంకేసులలో నిర్వాసితులతో ప్రత్యక్షంగా చర్చిస్తే, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ ఉన్నా బ్రతకడానికి పనులకు బయట ఊర్లకు వెళ్లారనే కారణంతో పరిహారం ఇవ్వని భాదితులు 1500 మంది పైగా ఉన్నారని నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు నివాస యోగ్యమైన గృహాల నిర్మాణం జరగలేదు, గ్రామంలో ప్రాథమిక అవసరాలు తీర్చడం లేదు.

ప్రాజెక్ట్ మునక గ్రామం కన్నూతలలో అర్హులైన నిర్వాసితులకు పరిహారం అందకపోగా అనర్హులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పరిహారం పొందారని గ్రామాలలో ప్రజలు చెప్పారు. ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తీ కాలేదని తెలిపారు. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తీ కాకుండా వెలిగొండ ఎలా జాతికి అంకితం జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలిగారో అర్థం కావడం లేదన్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మరియు అవసరమైన వంతెనలు పూర్తీ కాలేదని బహిర్గతం అయ్యింద న్నారు.

రెండు టన్నెల్లు మరియు ప్రధాన డ్యామ్ మధ్య 2009 లో నిర్మించిన ఫీడర్ కెనాల్ మొత్తం మట్టితో పూడి పోయినదానికి నిర్వహణ, మరమత్తులు చేయకుండా దారుణంగా ఉందన్నారు. వెలుగొండ ప్రారంభ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగా కనిగిరి ఫ్లోరిడ్ ప్రభావిత ప్రాంతానికి రక్షిత మంచి నీరు అందాలన్నా, దొనకొండ పారిశ్రామిక నోడ్ మరియు కనిగిరి నిమ్జ్ కు పారిశ్రామిక అవసరాలకు నీరు అందాలన్నా, ప్రాజెక్టు పూర్తి అనంతరం 15 లక్షల ప్రజలకు త్రాగు నీరు మరియు 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందాలన్నా యుద్ధప్రాతిపదికన పనులు చేసినా కనీసం మరో 3 సంవత్సరాలు పట్టవచ్చని బీజేపీ నిజనిర్ధారణ కమిటీ భావించింది.

- Advertisement -

పూర్తీ కానీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ చేసినట్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అంటే నమ్మి ఓట్లు వేసిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడమేనన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కాకున్నా పూర్తీ చేసినట్లు అట్టహాసంగా ప్రారంభోత్సవానికి సిద్దం అనడం అంటే ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవ్వడమా? అనే అనుమానం కలుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

బీజేపీ నిజనిర్ధారణ కమిటీ లోలంకా దినకర్, ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు పీ. శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు శాసనాలసరోజిని, రాష్ట్రపార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ మరియు కల్యాణ చక్రవర్తి, పార్టీ అసెంబ్లీ కన్వీనర్లు ఎరగుండపాలెం, మార్కాపురం, గిద్దలూరు తదితర జిల్లా మరియు మండల స్థాయి నేతల బీజేపీ నిజనిర్ధారణ కమిటీ లో పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement