Thursday, May 2, 2024

Fire Accident: ప‌సుపు కోల్ట్ స్టోరేజ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దుగ్గిరాల‌లోని ఓ ప‌సుపు కోల్ట్ స్టోరేజ్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో ఎగిసిపడుతున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

దగ్గరలో ఉన్న మరిన్ని ఫైర్ ఇంజన్లను తేప్పించే ప్రయత్నం అధికారులు చేపట్టారు. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నికీలలూ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా చేసే అవకాశం ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement