Friday, December 6, 2024

Chandrababu: ఇవాళ అరకు, అమలాపురంల‌లో ‘రా.. కదలిరా’… పోలీసుల ఆంక్ష‌లు

నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.

అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అరకు నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం మండపేట చేరుకుంటారు. మండపేట బైపాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు గంటన్నర సేపు జరుగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం మండపేట నుండి బయల్దేరి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీసు ఆంక్షలు విధించారు. సబ్ డివిజన్ పరిధిలో అంతటా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని.. ఫైర్ క్రాకర్స్ కాల్చడo నిషేధమని తెలిపారు అమలాపురం డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్.. మద్యం మత్తులో వాహనాలు నడపరాదు. విచక్షణ రహితంగా, స్పీడ్ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి రైడర్స్ పై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ద్విచ్రవాహనాల సైలెన్సర్ లు తీసేసి, విన్యాసాలు చేస్తూ అధిక శబ్దాలు చేసినట్లయితే అటువంటి వాహనాలు స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అంతా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు అమలాపురం డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement