Sunday, May 5, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోటెత్తిన వర్షం – పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

కర్నూలు, సెప్టెంబర్ 3, ప్రభ న్యూస్ బ్యూరో.పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీటి మూలంగా పలుచోట్ల పంట పొలాలు నీట మునిగి భారీ నష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని చాగలమర్రిలో కురిసిన వర్షం వల్ల లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లింది. నందికొట్కూరులో కూడా భారీ వర్షం నమోదు చేసుకోవడంతో పంట, పొలాలు నీటిమనగాయి, ఇక్కడ కూడా పలు చోట్ల వాగులు, పొంగి పొర్లాయి. ఆదోనిలో జోరుగా వర్షం కురిసింది. వీటి మూలంగా రూ.30 లక్షలు విలువ చేసే పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

ఇక గాలి,వర్షం దాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నమోదైన వర్షపాతం ఆదోని డివిజన్‌లో 168.4 మిమీ వర్షంపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి ఆదోని డివిజన్‌లో మొత్తం 168.4, సగటు 18.7 మిమీ వర్షపాతం ఆదివారం నమోదైంది. ఆదోని 94.8, పెద్దకడుబూరు 40.4, కౌతాళం 8.4 మిమీ, మంత్రాలయం 7.6, ఎమ్మిగనూరు 4.8, నందవరం 4.6, గోనెగండ్ల 3.6, కోసిగి 4.2 వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అవుకు మండలంలో కూడా బారి వర్షం కురిసింది.ఎర్రమల కొండల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పలపాడు హయత్ ఖాన్ చెరువు, కునుకుంట్ల దీక్షితులు చెరువుకు వరద నీరు చేరడంతో నిండుకుండలా తలపిస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే పరిధిలోవాగులు వంకలు పొంగి ప్రవహించాయి. కునుకుంట్ల, ఉప్పలపాడు చెరువులకు వరద నీరు వచ్చి చేరింది.దీంతో ఎత్తిపోత ద్వారా అవుకు రిజర్వాయర్ కు వరద నీరు చేరుతుంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో వర్షాలు లేకపోగా, ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో వాతావరణంలో ఆకస్మికంగా వచ్చిన మార్పుల వల్ల వర్షాలు కురవడం ఒగింత ప్రజలకు ఊరటిచ్చిన… వంట నష్టం మాత్రం తప్పులేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement