Sunday, May 5, 2024

Breaking: తిరుమలలో భారీ వర్షం.. క్యూ లైన్ల‌లో భక్తుల ఇక్కట్లు

తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని కుండ‌పోత వాన కురిసింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ల‌లో ఉన్న వారు వ‌ర్షం తాకిడికి పూర్తిగా త‌డిచిపోయారు. అయినా శ్రీ‌వారి ద‌య అనుకుంటూ అట్లాగే త‌డి దుస్తుల‌తో ద‌ర్శ‌నానికి వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement