Thursday, May 2, 2024

మహిళకు పునర్జన్మ… విజయవంతంగా గుండె మార్పిడి

తిరుపతి హెల్త్, (ప్రభన్యూస్):టీటీడీ శ్రీ పద్మావతి హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో 36 ఏళ్ల మహిళలకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించారు. గురువారం మధ్యాహ్నం నెల్లూరు అపోలో ఆసుపత్రి నుంచి గుండెను సేకరించిన వైద్యులు గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం ఆసుపత్రికి తీసుకువచ్చారు.ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తో కూడిన వైద్యుల బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి గుండె మార్పిడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు

.వివరాల్లోకెళ్తే నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 33 ఏళ్ల ఓ మహిళ బ్రాండెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. అప్పటికే అవయవదాన్ లో నమోదు చేసుకున్న 36 ఏళ్ల మహిళలకు గుండెను అందించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.మిగిలిన అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు.

గుంటూరు ప్రాంతానికి చెందిన 36 సంవత్సరాల మహిళ గుండె క్షీణిత ( డైలేటెడ్ కార్డియో మయోపతి) సమస్యతో బాధపడుతోంది. గత మూడు నెలలుగా తిరుపతిలోని పద్మావతి హృదయాలయం ఆసుపత్రికి వచ్చి తాత్కాలిక చికిత్స పొందుతూవచ్చారు.వైద్య పరీక్షలు నిర్వహించడంతో గుండ మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. సంబంధిత మహిళ వివరాలను అవయవదాన్ లో నమోదు చేసుకున్నారు.గుండె లభ్యతను తెలుసుకొని అధికారుల కోఆర్డినేషన్ తో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వైద్యుల బృందం అంబులెన్స్ తీసుకెళ్లి గుండెను సేకరించి అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి తీసుకువచ్చారు.‌

మధ్యాహ్నం 12: 20 గంటలకు నెల్లూరు అపోలో ఆసుపత్రి వద్ద బయలుదేరి మధ్యాహ్నం 2: 30 గంటలకు పద్మావతి హృదయం కు తీసుకువచ్చారు.- గుండు మార్పిడి చికిత్స పూర్తి ఉచితంగానేగుంటూరు ప్రాంతానికి చెందిన 36 సంవత్సరాల మహిళలకు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తో కూడిన వైద్యుల బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి గుండె మార్పిడి చేశారు.

- Advertisement -

. సుమారు రూ. 12 లక్షల ఖరీదైన ఈ గుండె మార్పిడి చికిత్సను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పూర్తి ఉచితంగా అందించారు. టిటిడి అధికారులు సీఎంఓ కార్యాలయ అధికారులను సమన్వయం చేసుకుంటూ అటు పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు ప్రక్రియలను సంయుక్తంగా పూర్తి చేశారు.

శ్రీ పద్మావతి హృదయాలయం ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి సీఎంఓ కార్యాలయం అధికారులతో మాట్లాడి గంటల వ్యవధిలోని నిధులను మంజూరు చేయించారు. వేగంగా స్పందించిన సీఎమ్ఓ గుండె మార్పిడి చికిత్స సహకరించి మహిళకు పునర్జన్మను ప్రసాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement