Monday, April 29, 2024

కటకటాల్లోకి కామాంధుడు

*మగ పిల్లల పై కామవాంఛ తీర్చుకొని ఆ పై హత్య *నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామన్న అర్బన్ ఎస్పీ ఆర్. ఎన్ అమ్మిరెడ్డి

గుంటూరు – సైకో కిల్లర్ గోపీని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అభం, శుభం తెలియని మగపిల్లలతో కామ వాంఛని తీర్చుకోవడం, సాక్ష్యాలు బయటకు రాకుండా చేసేందుకు ఆ పిల్లల్ని చంపేయడం ఆ మూర్ఖుడు చేసే పని. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిథిలో ఇదే తరహాలో ఇద్దరు చిన్నారుల్ని హత్య చేసిన సైకో కిల్లర్ గోపీని అర్బన్ పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించి నిందితుడికి కఠినశిక్ష పడేలా చేస్తామని చెప్పారు. చివరిగా కేసు చేధించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement