Friday, April 19, 2024

మోహన్ బాబుకి కోలా జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాళహస్తి – సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర మీడియా అధ్యక్షులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు శేష వస్త్రం అందించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది అని దాంతో కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement