Monday, April 29, 2024

ఎపి మ‌ద్యం షాపుల్లో న‌యా దందా..

అమరావతి, : ప్రభుత్వ మద్యం షాపుల్లో ‘నయా దందా’కు తెరలేచింది. తొలి నుంచి బ్రాండెడ్‌ మద్యం బార్లకు..బ్లాక్‌ మార్కెట్‌కు తర లిస్తూ మద్యం షాపుల సిబ్బంది సొమ్ము చేసుకుంటు న్నారు. ఆ రకంగా వస్తున్న ఆదాయంచాలడం లేదనో..లేక బాహాటంగా చేస్తున్నప్పటికీ ఉన్నతాధికా రులు మిన్నుకుంటున్నారనో తెలియదు కాని నకిలీ ఎమ్మార్పీలకు తెరలేపారు. అత్యధిక డిమాండ్‌ ఉన్న చీప్‌ లిక్కర్‌ మద్యం బాటిళ్లపై సొంత ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటిస్తూ భారీ కుంభకోణానికి పాల్పడుతు న్నారనడానికి కృష్ణాజిల్లాలో వెలుగు చూసిన ఘటనే నిదర్శనం. కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరశ గ్రామంలోని మద్యం షాపులో కొంతకాలంగా కొత్త ఎమ్మార్పీ రేట్లపై మద్యం విక్రయిస్తున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే రేట్లు పెరిగాయంటూ చెప్పడంతో మిన్నుకుండిపోతు న్నారు. ఇటీవల ఓ వ్యక్తి వేరే ప్రాంతంలో కొనుగోలు చేసిన మద్యం కంటే తమిరశ షాపులో రూ.40 అదనంగా ఉండటంపై నిలదీశాడు. దీనికి షాపుల నిర్వహకులు నిర్ల క్ష్యంగా సమాధానం చెప్పడంతో తెలిసిన వ్యక్తులను పట్టు కొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఎక్సైజు ఉన్నతాధి కారుల దాడుల్లో 9వేల కొత్త ఎమ్మార్పీ స్టిక్కర్లు దొరికాయి. దీంతో ఖంగుతిన్న ఎక్సైజు అధికారులు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చాలా కాలంగా ఈ వ్యవ హారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. నకిలీ ఎమ్మార్పీల వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎక్సైజు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్త తనిఖీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
కాసులు కురిపిస్తున్న కొత్త పాలసీ
రాష్ట్ర ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ ఎక్సైజు అధికారులు, మద్యం షాపుల నిర్వహకులకు కాసులు కురిపిస్తోంది. దశల వారీ మద్య నిషేధం అమలులో భాగం గా మద్యం పాలసీలో ప్రభుత్వం పలు మార్పు లు చేసింది. ప్రైవేటు నిర్వహణలోని షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఏటా షాపుల సంఖ్య ను తగ్గిస్తోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 4383 మద్యం షాపులు ఉండగా..ఇప్పుడవి 2900కు తగ్గించారు. పలు ప్రాంతాల్లో షాపుల సంఖ్య తగ్గడం, బార్లలో ధరలు చుక్కలు అంటుతుండటంతో మీడి యం, చీప్‌ లిక్కర్‌ తాగేవారు ప్రభుత్వ మద్యం షాపుల పైనే ఆధారపడుతున్నారు. షాపులకు ఉన్న డిమాం డ్‌ను ఎక్సైజు ఉద్యోగులు, షాపుల్లో పని చేసే సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క మద్యం షాపు రోజువారీ అనధికారిక ఆదాయం రూ.12వేల వరకు ఉంటుందని చెపుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తొలి నుంచీ పక్కదారే..
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో తొలి న ుంచి కూడా పలు అవకతవకలు చోటు చేసుకుంటు న్నట్లు చెప్పొచ్చు. తొలి రోజుల్లో షాపులకు వచ్చిన బ్రాండెడ్‌ మద్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునే వారు. ఇప్పుడు అదనంగా బార్లకు తరలిస్తూ సైతం సొమ్ము చేసుకుంటున్నారు. బార్లలో బ్రాండెడ్‌ మద్యం సరఫరాపై ఉన్న ఆంక్షలు, రేట్ల పెంపు వంటి కారణాల నేపధ్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో నుంచి భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎక్సైజు అధికారుల సాయంతో మద్యం షాపుల సిబ్బంది యధేచ్చగా బ్లాక్‌ మార్కెట్‌ దందాను నిర్వ హిస్తున్నారు. రాష్ట్రంలోని షాపుల్లో బ్రాండెడ్‌ మద్యం మచ్చుకైనా అమ్మడం లేదం టూ తొలి నుంచి కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారులు పట్టిం చుకోవడం లేదు. ఇదే వారికి వరంగా మారిం దనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మార్పీ బోర్డులేవీ..
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందరికీ కనిపించే విధంగా బోర్డులు ఉండాలనేది ఉన్నతాధికారుల ఆదేశాల సారాంశం. ఇప్పుడెక్కడా ఆ పరిస్థితి లేదని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ వినియోగదారు లకు కనిపించని ప్రాంతాల్లో పెడుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే భూతద్దం పెడితే తప్ప కనిపించని బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఎక్సైజు పాత్ర లేదా?
రాష్ట్రంలో మద్యం షాపుల్లో బ్లాక్‌ మార్కెటింగ్‌, బార్లకు తరలింపు, నకిలీ ఎమ్మా ర్పీలు చోటు చేసుకుం టుంటే ఎక్సైజు అధికారులు ఏం చేస్తున్నారనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో మాదిరి నాటు సారా, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై దాడులు చేసే పని ఎక్సైజు శాఖకు లేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ ఈబీ)ని ఏర్పాటు చేసి..ఎక్సైజు శాఖను అమ్మ కాల పర్య వేక్షణకు పరిమితం చేసింది. ఎక్సైజు స్టేషన్‌ పరిధిలోని షాపులను ఇన్‌ స్పెక్టర్‌ నేతృ త్వంలో ఎస్‌ఐలు, సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ప్రతి షాపులో కాని స్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుళ్లలో ఎవరో ఒకరు విధులు నిర్వహిస్తున్న నేపధ్యంలో ఇవన్నీ ఎలా జరుగు తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ వాటాలు ఉన్నందునే ఇలాంటి చర్యలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నట్లు పలువురు చెపుతున్నా రు. కృష్ణాజిల్లాలో వెలుగు చూసిన నకిలీ ఎమ్మార్పీల నేపధ్యంలో ఉన్న తాధికారులు రాష్ట్ర వ్యాప్త తనిఖీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎమ్మార్పీల అమలు, సరుకు బయటకు తరలింపు, ఇతర నిబంధనల విరుద్ద చర్యలపై తనిఖీలు నిర్వహిం చి చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement