Thursday, April 25, 2024

అదే వాడి, అదే వేడి ..పవన్ పై చిరు ప్రసంశలు

తన కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిన్న వకీలు సాబ్ మూవీ చూసిన చిరంజీవి… పవన్కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కల్యాణ్ మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి.. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ పేర్కొన్నారు కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు’ అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, వ‌కీల్ సాబ్ సినిమాకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement