Sunday, May 5, 2024

అక్కచెల్లెమ్మలకు పెద్దన్నగా జగన్ – ఉప సభాపతి కోన‌

బాపట్ల – గత ప్రభుత్వం మహిళలాను చిన్నచుపు చూస్తే,జగన్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోరుకొని
నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళాలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు.పురపాలక సంఘం కార్యాలయంలో వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో సభలో ఆయన ప్రసంగించారు.రాష్టంలో అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని చెల్లించలేక ఎందరో మహిళలు పడుతున్న ఇబ్బందులను పాదయాత్రలో తెలుసుకొని,మహిళల సమస్యలను పరిష్కరించాలనే ద్యేయంతో వడ్డీ లేని రుణాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల కళ్ళలో ఆనందం చూస్తున్నారని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని మూడు మండలంలో 3708 గ్రూపులకు రెండు కోట్ల,70 లక్షలు వడ్డీ లేని రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు.పట్టణంలో వెయ్యి గ్రూపులకు కోటి,8లక్షల,16వేల,532 రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.అదే విధంగా వెలుగు,మెప్మాలలో యనిమేటర్లు,ఆర్పీలు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పారు.రాజకీయాలు కావాలనుకునే వారు వెంటనే ఉద్యోగాల నుంచి తప్పుకొని వెళ్లిపోవాలన్నారు.
నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ పక్క స్థలాలు అందించామన్నారు. వచ్చే సంవత్సరం కు అన్ని గృహాలు పూర్తి చేస్తామని,ప్రతి ఒక్కరు నివాసం ఏర్పటు చేసుకోని,5 సంవత్సరాల పాటు,అక్కడే నివాసం ఉండలన్నారు.లేకపోతే పట్టాలు రద్దు అవుతాయని పేర్కొన్నారు.కరోన వైరస్ పై ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండలన్నారు.ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కోర్దినేటర్ లక్ష్మణ చారి,మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్,ఎంపిడిఓ రాధాకృష్ణ,డిఇఇ మాల్యాద్రి,వెలుగు ఏపీఎం లక్ష్మికుమారి,వెంకటేశ్వర్లు,సంతోష్,మెప్మా సీఈఓ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement