Sunday, May 5, 2024

ఈఎస్ఐ పీఎఫ్ బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాల తప్పవు

గుంటూరు సిటీ మార్చి 16 (ప్రభ న్యూస్ ) గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేయుచున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవలసిన ఈ ఎస్ ఐ, పిఎఫ్ బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే మున్సిపల్ కార్మికులు ఉద్యమ బాట పడతారని ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు ఈదుమూడి మధుబాబు మంగళవారం కార్మిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ మలేరియా విభాగాలలో 40 వేల మంది కార్మికులు అవుట్సోర్సింగ్ పద్ధతి పై విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని వీరిని గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్చుకొని ప్రతి నెల జీతాలు చెల్లిస్తుందని అయితే వారి జీవితాల భద్రత కోసమని వారి నెలసరి జీతం నుంచి మినహాఇంపు చేస్తున్న పీఎఫ్ ఈఎస్ఐ లను వారి ఖాతాలో జమ చేయడం లేదని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వారు చెల్లించవలసిన కంట్రిబ్యూషన్ కూడా చెల్లించడం లేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈఎస్ఐ వైద్య సేవలు అందక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని కార్మికులు పనిచేసే సమయంలో ప్రమాదాలు జరిగితే వారికి వైద్యం అందడం లేదని అలాగే కార్మికుల కుటుంబ అవసరాల కోసం పి ఎఫ్ లో లోన్ పెట్టుకునే అవకాశం కూడా లేదని ఈ కారణాలతో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కార్మికులకు అత్యవసర సేవలైన ఈఎస్ఐ వైద్యం కూడా అందడం లేదని ఈ కారణంగా కార్మికులకు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన నా కౌన్సిలర్ లకు కార్పొరేటర్లకు అలాగే మున్సిపల్ చైర్మన్ లకు అలాగే కార్పొరేషన్ మేయర్ లకు వినతి పత్రాల ద్వారా ఈ విషయాన్ని తెలియపరచడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ., ఈ సమస్యను వారి దృష్టికి తీసుకొని పోయి వారు నిర్వహించిన మొట్టమొదటి కౌన్సిల్లో ఈ సమస్యపై ఒక తీర్మానం చేసి ఇ ప్రభుత్వానికి పంపించే విధంగా కోరడం జరుగుతుందని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ లో లో దాదాపు 3464 మంది ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం మలేరియా టౌన్ ప్లానింగ్ విభాగాల లో పనిచేసే కార్మికులు ఉన్నారని మీరు కూడా పై తెలిపిన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను కమిషనర్ళ్ల అనురాధ గారి దృష్టికి తీసుకుని వగా కమిషనర్ గారు అవుట్సోర్సింగ్ ఎండి గారితో మాట్లాడటం జరిగిందని కానీ నీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి స్పందన లేదని ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల లో అన్ని కార్పొరేషన్లో కార్మికులు కమిషనర్ను కలిసి ఇ విన్నవించుకోవడం జరిగింది అని అక్కడి కమిషనర్లు కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎంపీ గారితో మాట్లాడటం జరిగిందని కానీ నీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి స్పందన లేదని ఈ విషయాన్ని గతంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఈ విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది అన్నారు. మంత్రి జేఏసీ నాయకులకు హామీ ఇస్తూ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామని చెప్పటం జరిగిందని కానీ ఇప్పటికీ ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్య పరిష్కారం కాలేదని మధు బాబు అన్నారు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లోని మేయర్ లకు మున్సిపాలిటీలోని చైర్మన్లకు ముందుగా వినతిపత్రాలు ఇచ్చి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారిని కోరడం జరుగుతుందన్నారు. అప్పటికి సమస్య పరిష్కారం కాని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలకు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లో యూనియన్ నాయకులు రాయపూడి కోటి బాబు, వలపర్ల సుధీర్ బాబు ,ట్రెజరర్ నాగబాబు సుమన్ ,జాయింట్ సెక్రెటరీ నల్గొండ జయరాం ,వైస్ ప్రెసిడెంట్ గుంటుపల్లి ప్రేమ్చంద్ ,కమిటీ సభ్యులు పూణే పల్లి శ్రీనివాసరావు ,భూపతి ,అమరేశ్వర రావు, అబ్దుల్లా తదితరులు పాల్గొనడం జరిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement