Tuesday, May 21, 2024

అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం

తాడేపల్లి,ఫిబ్రవరి21(ప్రభ న్యూస్) రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పల్లవసేన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబు రావు అన్నారు.మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ పల్లవసేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ పల్లవసేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లేటి బాబూరావు,రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ నాగసుందరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని
మండిపడ్డారు. ఇచ్చాపురం నుండి తడ వరకు తీర ప్రాంతం వెంబడి సుమారు 40లక్షల జనాభాతో దాదాపు 10 నియోజకవర్గాలలో ప్రత్యక్షంగా, 50 నియోజకవర్గాలలో పరోక్షంగా గెలుపు ఓటములను శాసించగలిగినటువంటి సామాజికవర్గానికి చెందినవారిమని అన్నారు.
ఎమ్మెల్సీల భర్తీల విషయంలో మాకు జరిగినటువంటి అన్యాయం తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామనితెలిపారు,
ఎన్టీ రామారావు అగ్నికుల క్షత్రియుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయంగాప్రోత్సహించారని, స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం ప్రోత్సహిస్తూ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి ఉమ్మడి ఏపీలో రెండు ఎమ్మెల్సీలు మూడు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి స్థానం, రెండు ఇన్చార్జ్ , ఒక వైన్ ఛాన్సలర్, నాలుగు చైర్మన్లు ఇచ్చి మరింత ప్రోత్సహించారని కొనియాడారు.రాజశేఖర్ రెడ్డిని సీఎంగా చేసే విషయంలో అగ్నికుల క్షత్రియుల పాత్ర వెలకట్టలేనిదని ఆనాడు నిరూపించుకున్నామని అన్నారు.నేడు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని వాపోయారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి కొంచెం చిన్నచూపు చూసినట్లుగా కనిపిస్తూఉందని అన్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఎమ్మెల్సీ స్థానాలలో కనీసం ఒక్క స్థానాన్నైన ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు అన్యాయం చేయకుండా కేటాయించినటువంటి స్థానాలలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తారని ఆశిస్తూవిన్నవించుకుంటున్నామని కోరారు.లేని పక్షంలో రాబోయోరోజుల్లో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ వ్యతిరేకతను చవిచూడవలసివస్తుందని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో పల్లవ సేన సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నడకుడిది నాగరాజు, గుంటూరు జిల్లా అధ్యక్షులు మోపిదేవి శివనాగరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షులు వాడపల్లి అర్జునరావు, ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల కార్యదర్శులు పితా నాగేంద్ర కుమార్, తమ్ము అశోక్ చక్రవర్తి రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొక్కొలిగడ్డ నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement