Sunday, April 28, 2024

సీనియర్ ఏపీపీ సునీల్ కుమార్ కు అదనపు బాధ్యతలు

తెనాలి : సీనియర్ ఏపీపీ సునీల్ కుమార్ కు అదనపు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సోమవారం సునీల్ కుమార్ వివరాలు వెల్లడిస్తూ.. తెనాలి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఏసీపీగా.. తెనాలి ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సీనియర్ ఏపీపీగా అదనపు బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఏపీపీ శివలీల అనంతపురంలో పోలీసు ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ నిమిత్తం వెళ్లారని తెలిపారు. అందువలన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టుకి మూడున్నర నెలలు సునీల్ కుమార్ ఏపీపీగా అదనపు బాధ్యతలు నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement