Sunday, April 28, 2024

పిడుగురాళ్ళలో కరోనా పేషేంట్స్ కు 5 ఆసుపత్రుల్లో 135 బెడ్స్..

పిడుగురాళ్ల – కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా పిడుగురాళ్ళ తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ భాస్కరరావు అధ్యక్షతన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని 5 ఆసుపత్రుల్లో ప్రభుత్వం కొవిడ్ పేషెంట్లకు బెడ్లు కేటాయించింది. పల్నాడు హాస్పిటల్ – 25 బెడ్లు, అంజిరెడ్డి హాస్పిటల్ – 35, వున్నం హాస్పిటల్ -25, చిగురుపాటి హాస్పిటల్- 25, అభయ హాస్పిటల్ – 25 చొప్పున మొత్తం 135 బెడ్లు కరోనా పేషెంట్లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఆసుపత్రుల యాజమాన్యం రోగులను చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకొని, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో రోజుకి 20 – 25 కోవిడ్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా పట్టణ, మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ భాస్కరరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ యస్ఐ సమీర్ భాష, మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్వరరావు, ఎంపీడీఓ కాశయ్య, పి.హెచ్.సి. వైద్యాధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement