Sunday, May 5, 2024

ఎపిలో అయిదో తేది నుంచి ప‌గ‌టి పూట పాక్షిక క‌ర్ఫ్యూ…

అమరావతి – ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందిస్తోంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీలో ప‌గ‌టి పూట పాక్షికంగా క‌ర్ఫ్యూ విధించింది. సీఎం జగన్ వద్ద కోవిడ్‌పై సుదీర్ఘంగా సమీక్షించిన అనంత‌రం ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎంతో చర్చించినట్టు తెలిపారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్‌ను కూడా ఉపయోగించుకోవడంతో పాటు ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులు పనిచేసేలా చర్యలు తీసుకునే అంశాలపై చర్చించామన్నారు. అయిదో తేది నుంచి ఎపి అంత‌టా మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేయ‌నున్న‌న‌ట్లు తెలిపారు… ఈ కర్ప్యూ ఉద‌యం అయిదు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని చెప్పారు.. రెండు వారాల పాటు అమ‌లవుతుంద‌ని తెలిపారు. . ఏపీకి ఉన్న ఆక్సిజన్ కొరతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తామని ఆళ్ల నాని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement