Friday, May 17, 2024

ఉగాది నాటికి జిజిహెచ్ లో ఉచిత భోజన పధకం ప్రారంభిస్తాం…..మంత్రి శ్రీరంగనాథరాజు

గుంటూరు మెడికల్ – సర్వ జన ఆసుపత్రిలో రోగుల సహాయకుల కు ఉచిత భోజన పథకాన్ని ఉగాది రోజున ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ రంగనాధ రాజు అన్నారు.భోజన శాలలో జరుగుతున్న నిర్మాణ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.గురువారం ఆసుపత్రిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.రోగుల సహాయకుల కు రెండు పూటల భోజనాలు అందించాలన్న సంకల్పం త్వరలో తీరబోతుందని ఆయన చెప్పారు.ఈ పథకానికి మంత్రి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఒకేసారి 300 మంది భోజనం చేసేవిధం గా సిద్ధం చేస్తున్నామన్నారు.కార్పొరేట్ హోటల్ ను తలపించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని ఆయన వివరించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు సాగుతున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగాది రోజున భోజన శాల ప్రారంభించడంసంతోషకరమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ సతీష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు గోపాల్ రావు, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్ర రాజు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement