Wednesday, May 1, 2024

రుయా ఘటనపై స‌ర్కారు సీరియస్‌.. సూపరింటెండెంట్‌కు షోకాజ్‌, ఆర్​ఎంవోపై సస్పెన్షన్‌ వేటు

అమరావతి, ఆంధ్రప్రభ: తిరుపతి రుయా ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సూపరిం-టె-ండెంట్‌ భారతికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతో పాటు ఆర్‌ఎంవోపై స స్పెన్షన్‌ వేటు వేశారు. మహా ప్రస్థానం పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నడుస్తున్న వాహనాల్ని రాత్రిళ్లు కూడా అందుబాటు-లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మృతదేహాల్ని తరలించేందుకు ప్రీ పెయిడ్‌ ట్యాక్సీలు అందుబాటు-లో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవల్ని అందించాలనే లక్ష్యంతో సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారని, ప్రభుత్వాస్పత్రుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తిరుపతి రుయా ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. రుయా ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోందని, బాధ్యులెవరున్నారన్నది పూర్తి స్థాయి విచారణ తర్వాత తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు. బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జరిగిన ఘటన అత్యంత అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పోలీసు శాఖ తరఫున కూడా చర్యలు తీసుకుంటు-న్నారని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement