Sunday, May 5, 2024

Breaking: జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది: హైకోర్టు

ఏపీలో వివాదాస్పదంగా మారిన పీఆర్‌సీ జీవోపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల తరఫున న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని వ్యాఖ్యానించింది. ఉద్యోగులకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని, అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని స్పష్టం చేసింది. అసలు పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పర్సెంటేజీని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదని తెలిపింది. ఈ పిటిషన్ కు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని ఎలా బెదిరిస్తారని ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement