Saturday, May 4, 2024

బస్సులో పట్టుబడిన బంగారు ఆభరణాలు.. విలువ ఎంతంటే..

ఎలాంటి బిల్లులు లేకుండా ప్రైవేటు ట్రావెల్ బస్సులో తరలిస్తున్నఅర కిలో బంగారు ఆభరణాలను కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఎస్ఇబి చెక్ పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారజామున పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి రాయదుర్గంకు వెళుతున్న ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సులో తనిఖీ చేయగా అందులో కర్ణాటకలోని బళ్ళారికి చెందిన ఓ వ్యక్తి బ్యాగులో సుమారు 544 గ్రాముల బంగారు వడ్డానాలు, నెక్లస్ లు గుర్తించారు. వీటి విలువ రూ. 28 లక్షలు విలువ చేస్తుంది.

తాను బళ్ళారి పట్టణానికి చెందిన రాజ్ మహల్ ఫ్యాన్సీ జువెలర్స్ షాప్ కు చెందిన గుమస్తా అని,ఈ ఆభరనాలు హైదరాబాడ్ ధన లక్ష్మి జువెలర్స్ నుండి తయారు చేయించి బళ్ళారి రాజ్ మహల్ జువెలర్స్ కు తీసుకొని పోతున్నానని వ్యక్తి తెలిపాడు. అయితే, ఈ ఆభరణాలకు సంభందించి బిల్లు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement