Monday, May 20, 2024

ఇచ్చిందే మెనూ, పెట్టిందే తిను.. ఏపీ గురుకులాల్లో మరీ అధ్వానం!

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగూడ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం మెనూ పటిష్టంగా అమలుచేయాలని ఆదేశాలు జారీ చేస్తూ అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తున్న ఆశ్రమాల నిర్వాహకులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ మెనూ సక్రమంగా అమలు చేయకుండా విద్యార్థులను అగచాట్లకు గురి చేస్తున్నారు.

అరకు లోయ రూరల్‌ , డుంబ్రిగుడ రూరల్‌,(విశాఖపట్నం) ప్రభన్యూస్ : వాస్తవానికి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం మెనూ విధానం రూపొందించింది. వారంలో విద్యార్థులకుఒక్కో విధంగా మెనూ అమలు చేయవలసి ఉంది. అ యితే ఆశ్రమాల నిర్వా హకులు కాసుల కక్కు ర్తికి అలవాటుపడి ప్రభుత్వం మెనూను అమలు చేయకుండా తమ సొంత మెను అమలు చేస్తూ విద్యా ర్థులను అర్ధాకలితో అలమటించేలా చేస్తున్నారు. విశాఖ మన్యం ప్రాంతంలో పౌష్టికాహార లోపంతో ఆశ్రమాల విద్యార్థులు రక్తహీనతకుగురై ఆసుపత్రి పాలవుతున్నారు. అలాగే కొంతమంది చ‌నిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆశ్రమాలలో పటిష్టంగా మెనూ అమలు చేయాలని భావించి, అందుకు చాప్టర్‌ రూపొందించి దాని ప్రకారం మెనూ అమలు చేయాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆశ్రమా వార్డెన్లు మాత్రం ప్రభుత్వ మెనూను పట్టించుకోకుండా మార్కెట్లో చవకగా దొరికే కూరగాయలను విద్యార్థులకు వండి పెడుతూ వారిని అర్ధాకలికి గురి చేస్తున్నారు. ఇచ్చింది మెనూ పెట్టిం దే తిను అనే మాదిరిగా ఆశ్రమ నిర్వాహకులు తయారవుతు న్నారు. ప్రధానంగా శనివారం దుంబ్రిగుడా బాలికల ఆశ్రమ పాఠశాలను విలేకరులు సందర్శించగా అక్కడ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది.

పర్యవేక్షణ లేక
హెచ్‌ఎం కమ్‌ వార్డెన్‌ బాధ్యతలు అప్పగించడం వలన ఇటు-వంటి దుస్థితి నెల కొంటు-ందని పలువురు పేర్కొంటు-న్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎం వేరుగా వార్డెన్‌ వేరుగా బాధ్యతలు నిర్వర్తిస్తుడండంతో కొంతవర-కై-నా అక్కడ మెనూ అమలు అవుతుందని హెచ్‌ఎం కమ్‌ వార్డెన్‌ ఉన్న పాఠశాలలో మెనూ అమలు కావడం లేదని దీనికి నిదర్శనమే డుంబ్రిగూడ బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల అని ప్రజా సంఘాల నాయకులు అంటు-న్నారు. పాఠశాలలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఉన్నత అధికారులు సందర్శించకపోవడం స్థానికంగా ఉన్న అధికారులు చూసిచూడనట్లు- వ్యవహరించడంతో డుంబ్రిగూడ బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇక్కట్లకు గురి చేస్తూ మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని పలువురు ఆదివాసి నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీ-వల కాలంలో ఆశ్రమాల మెనుపై ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్న ఎందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అస‌లు ప‌రిస్థితి ఇదీ..
పాఠశాలలో 500మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా శనివారం సుమారు 200మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఆ 200 మంది విద్యా ర్థులకు కూడా సరిపడా భోజనం లభించలేదు. వాస్తవానికి మధ్యాహ్నం క్యాబేజీ ఇగురు, సాంబారు, పెరుగు పెట్టవలసి ఉండగా కేవలం పసుపు కలి పిన క్యాబేజీ,నీళ్లు లాంటి రసం మాత్రమే పెట్టడం కనిపించింది. పెరుగు లేక పోగా మెనూ ప్రకారం క్యాబేజీ ఇగురు, సాంబారు లేదు. ప్రభుత్వం ప్రతిష్టా త్మకం గా అమలు చేస్తున్న ఆదివారం మధ్యాహ్నం, మంగళవారం సాయంత్రం అమ లుచేస్తున్నారు చికెన్‌ కూడా అత్యంత దారుణంగా ఉంటు-ందని విద్యార్థులు వాపో యారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఒక్క విద్యార్థికి 100 గ్రాముల చికెన్‌ ఇవ్వవలసి ఉండగా నిర్వాహకులు ఒక్క చికెన్‌ ముక్కతోనే సరిపెట్టి వారి కోరికకు భగ్నం కలిగిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకు ఉంటు-న్నారు. ఆ పెట్టిన కూర కూడా రుచి లేకపోవడం నూనె,ఇతర నిత్యావసర దినుసులు లేకపోవడం తో పచ్చి కూర తింటూ మౌనంగా తన బాధను వెళ్లగక్క లేక విద్యా ర్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంత జరుగు తున్నా గిరిజన సంక్షేమ అధికా రులు పట్టించుకోక పోవ డం వలన పిల్లలను అర్ధాకలితో ఉంచు తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఇదంతా నేతల భరోసా ఉండ‌డం వ‌ల్లేనా?
హెచ్‌ఎంలు వార్డెన్లు అధికార ప్రభుత్వ పక్షంలో ఉండడం వలనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తమకు ఏ సమస్య వచ్చినా అధికార పార్టీ అండగా ఉంటుదని ధీమాతోనే మెనూను సక్రమంగా అమలు చేయడం లేదని ఆదివాసులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉంటే తమకు ఏమి భయం అన్న దర్జాగా హెచ్‌ఎంలు, వార్డెన్లు ఉంటు-న్నారని దీనివలన గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదని ప్రజా సంఘాల నేతలు, ఆదివాసీల నాయకులు, ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి-కై-నా జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున్‌, గిరిజన సంక్షేమ శాఖ మం త్రి పాముల పుష్ప శ్రీవాణి, పాడేరు ఐటీ-డీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ స్పం దిం చి గిరిజన ఆశ్రమాల్లో అమలవు తున్న మెనూపై ప్రత్యేక కమిటీ- బృందాన్ని నియమించాలని, ఆబృం దం ద్వారా ఎప్పటికప్పుడు మెనూ అమలు తెలుసు కోవాలని సక్రమంగా మెనూ అమలు చేయని ప్రధానోపాధ్యా యులు డిప్యూటీ వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా డుంబ్రిగూడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు కమ్‌ వార్డెన్‌ పై సమగ్ర విచా రణ చేపట్టి ఆయనను తక్షణమే వార్డెన్‌ బాధ్యతలు తొలగించాలని తక్షణమే బదిలీ చేయాలని గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు, విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్‌ చేసు ్తన్నారు. కాగా డుంబ్రిగూడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దుస్థితిపై ఏటీడబ్ల్యూ మల్లికార్జున్‌ రెడ్డి వివరణ కోరగా అన్ని సమస్యలపై హెచ్‌ఎం కమ్‌ వార్డెన్‌తో చర్చిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement