Saturday, April 27, 2024

అంత‌రాష్ర్ట గంజాయి ముఠా అరెస్ట్…

విశాఖ -కై-ం : ప్రభ న్యూస్‌ : పోలీసుల కళ్ళు గప్పి అటవీ మార్గం ద్వారా పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టు- రట్టయింది. కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న సమయంలో పోలీసుల తనిఖీలతో స్మగ్లింగ్‌ ముఠా వ్యవహారం బయట పడింది. వెంటనే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరి కొంతమంది అక్కడి నుంచి పరార య్యారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి అటవీ మార్గం ద్వారా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందులో భాగంగా బియ్యం బస్తాల ముసుగులో స్మగ్లింగ్‌ చేస్తోంది. పోలీసు చెక్‌పోస్టు లను దాటించడానికి నకిలీ వే బిల్లులను ఉపయోగిస్తోంది. ఆపరేషన్‌ పరివర్తన కింద ఏపీ పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం గంజాయి పంటలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ ముఠా తమ సాగును ఒడిశా జిల్లా మల్కన్‌గిరి, కోరాపుట్‌లకు తరలించింది. జోడియాపుట్‌ గ్రామానికి చెందిన ఖేముడు సీతారాం, పరారీలో ఉన్న మరో నిందితుడితో కలిసి తమ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నాడు. రవాణా కోసం మహారాష్ట్ర రాజు, ఒడిశా నుండి చిత్రకొండ అడవుల ద్వారా ఏ.ఎస్‌.ఆర్‌ జిల్లా ధారకొండ శివార్లకు తమ తలపై మోసే కూలీల ద్వారా గంజాయిని తరలించడానికి ఆర్డర్లు ఇచ్చాడు. పోలీస్‌ స్టేషన్ల పరిసరాల్లో కఠినమైన వాహన తనిఖీలను తప్పించుకోవడానికి ఈ ముఠా ఈ పద్ధతిని అవలంబించింది. ధారకొండ అడవుల్లో, చుట్టు-పక్కల ప్రాంతాల్లో గంజాయిని లోడ్‌ చేసి ఎట్టకేలకు చింతపల్లి సమీపంలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టు-బడ్డాడు. ఈ ఆపరేషన్‌లో 1700 కిలోల గంజాయితో పాటు- నిందితుల మొబైల్‌ ఫోన్లు, టాటా ట్రక్కు, బైక్‌, నకిలీ వే బిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చింతపల్లి సబ్‌డివిజన్‌ బృందానికి చింతపల్లి అడిషనల్‌ ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిషోర్‌ ఆధ్వర్యంలో చింతపల్లి సిఐ కె.రమేష్‌, చింతపల్లి ఎస్సై అరుణ్‌, సీలేరు ఎస్సై రామ కృష్ణ, ఎస్సై మంపా లోకేష్‌, చంద్రశేఖర్‌ లు ఈ ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు- ముగ్గురిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన వీరిని ఏ.ఎస్‌.ఆర్‌ అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ తుహిన్‌ సిన్హా అభినందించారు.

మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు..
గంజాయి స్మగ్లర్ల పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. వారి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు అన్ని వైపుల నుంచి నిఘాను మరింత పెంచారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టు- రట్టు- చేశారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టు-కున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలతో కొందరు స్మగ్లర్లు పరారయ్యారు. పట్టు-బడ్డ వారి నుంచి మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు అని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement