Friday, April 19, 2024

క‌బ్జా చిత్రంపై ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న ఉపేంద్ర‌, శ్రియ

ఐఎండీబీ ఒరిజినల్ సిరీస్ అయిన ‘ఆస్క్ ఈచ్ అదర్ ఎనీథింగ్’ అభిమానులను తమ అభిమాన సెలబ్రిటీలకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్ లో వారు తమ జీవితాల గురించి తమ సినీ జీవితంలోని అనుభవాలను, వారి ప్రాజెక్టుల్లోని కొన్ని ఆసక్తికరమైన షూటింగ్ సమయంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. దీనిలో భాగంగా కన్నడ చిత్రం కబ్జా విడుదలకు ముందు, ఉపేంద్ర, శ్రియా శరణ్ కలిసి వారి సినిమా షూటింగ్ అనుభవాలను, ఒకరికొకరు మొదటి సారి కలిసి నటించిన విశేషాలను పంచుకున్నారు.

ఉపేంద్రతో తొలిసారి కలిసి నటించడం గురించి శ్రియ మాట్లాడుతూ.. తాను మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు ‘నమామి నమామి’ అనే పాటను చిత్రీకరిస్తున్నామ‌న్నారు. దీన్ని చిన్ని అందంగా కొరియోగ్రఫీ చేశారన్నారు. ఉపేంద్ర సెట్ కు వస్తున్నారని, చిత్రబృందం చెప్పడంతో చుట్టుపక్కల వారంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన సూపర్ స్టార్ కానీ అలా వుండరు సింపుల్ గా తన సినిమా సెట్ లో అందరినీ ప్రేమిస్తూ అందరితో మంచి సమయాన్ని గడుపుతారన్నారు. అయనికి ప్రశంసలంటే నచ్చదు కానీ, ఇతరులను సులభంగా ప్రసంసిస్తారు అదే ఆయనలోని గొప్పతనాన్ని చెబుతుందన్నారు. దీంతో ఉపేంద్ర శ్రియను పొగడటం మొదలుపెట్టాడు. “మీరు ఈ సినిమా చేస్తున్నారని వినగానే వావ్ అనుకున్నాను! ఒక కల నిజమైందన్నారు. గతంలో రెండు, మూడు సినిమాల కోసం మిమ్మల్ని సంప్రదించాను. కానీ, మీరు చాలా హిందీ, తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement