Friday, May 17, 2024

ఈ నెల 16 నుంచి ఏపీలో ‘సబల’ సదస్సులు..షెడ్యూలు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ

అమరావతి, ఆంధ్రప్రభ : మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన చట్టాలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై మహిళా కమిషన్‌ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు మహిళా కమిషన్‌ నిర్వహించే ‘సబల’ ప్రాంతీయ సదస్సులషెడ్యూలు, కార్యాచరణను కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడి పద్మ శుక్రవారం మీడియాకువెల్లడించారు. ఈనెల 16న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగులతో గుంటూరులోని జిల్లా పరిషత్‌ హాలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 23వ తేదీన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉద్యోగులతో ఏలూరు కేంద్రంగా , 30వ తేదీన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ఉద్యోగులతో కడప కేంద్రంగా, ఏప్రిల్‌ 6వ తేదీన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉద్యోగులతో వైజాగ్‌ కేంద్రంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆయాచోట్ల జరిగే సదస్సుల విజయవంతానికి ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, అదేవిధంగా ఇతర చోట్ల పని చేసే మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సౌకర్యాల కోసం జరిగే పోరాటంలో మహిళా కమిషన్‌ అండగా ఉంటుందనే సందేశం ‘సబల’ సద స్సుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో మహిళల భ ద్రత, దిశ యాప్‌, సమానత్వం తదితర అంశాలపై విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, మహిళా భ ద్రతకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్ళాలని మహిళా కమిషన్‌ సంకల్పంగా వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement