Monday, May 6, 2024

కాంగ్రెస్‌ కోరుకుంటే కలిసి పోటీ, 2024 ఎన్నికలపై మమతా బెనర్జీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల తీర్పు.. ప్రజలది కాదని ప.బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరు కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్‌ కోరుకుంటే.. ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. వారికే నష్టదాయకం అవుతుందన్నారు. 2024 ఎన్నికల ఫలితాలను ఈ 2022 ఎన్నికలు నిర్దేశిస్తాయన్న వాదనలు సరికాదన్నారు.

అటు యూపీలో బీజేపీ భారీ విజయం సాధించినంత మాత్రా.. 2024లో మళ్లి బీజేపీయే వస్తుందనడం భ్రమే అని కొట్టిపారేశారు. యూపీలో ఈవీఎం అక్రమాలు ముమ్మరంగా జరిగాయని ఆరోపించారు. అఖిలేష్‌ యాదవ్‌ మనో స్థయిర్యాన్ని కోల్పోవద్దని, గతం కంటే ఈసారి ఓటింగ్‌తో పాటు సీట్లు పెరిగాయన్నారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్‌ పరీక్షలు జరిపేలా అఖిలేష్‌ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement