Tuesday, April 30, 2024

కాణిపాకంలో తొలిసారిగా.. లక్ష మోదక హావనం

కాణిపాకం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో తొలిసారిగా మూడు రోజుల పాటు జరిగే లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న యాగం విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి, . శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ప్రారంభమైంది.

ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు.. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం, స్వామివారు దివ్య అనుగ్రహ భాషణం నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, యంత్రస్థాపన, మూలమస్త్ర జపము, మోదక హవనము, మహానివేదన, మంత్రపుష్పము, మొదలుకొను కార్యక్రమాలు, నిర్వహించారు.. జరిగింది, ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి , ఈ.వో వెంకటేశు , అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement