Thursday, May 2, 2024

శాంతించిన కృష్ణమ్మ.. తగ్గిన వరద ఉధృతి

కృష్ణానదికి వరద తగ్గుముఖం పడుతున్నది. శ్రీశైలం జలాశయానికి 58,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ ఫ్లో 1,20,088 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను ఇప్పుడు 212.4385 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇక, నాగార్జున సాగర్‌ కు 66,057 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అదేస్థాయిలో ఔట్‌ ఫ్లో ఉన్నది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 580.70 అడుగులుంది. ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ఇది కూడా చదవండిః ఒక్క ఆవు పాలతో లక్ష రూపాయలు

Advertisement

తాజా వార్తలు

Advertisement