Sunday, May 5, 2024

AP: బెజ‌వాడ‌లో వైసిపి – జ‌న‌సేన‌ల ఫ్లెక్సీ వార్….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జరగనున్నాయి. దీంతో అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఇతర పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజా పాలనలో తమ మార్క్‌ ఏంటో వివరిస్తున్నాయి పార్టీలు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో పోస్టర్ వార్ షురూ అయింది.

బెజవాడలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ కు తెర‌ల లేచింది.. ఇరు పార్టీలు ఫ్లెక్సీలతో పోటాపోటీ క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన ఫెక్సీలను ఏపీలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసింది.
“సిద్ధం”.. అని వైసీపీ ప్రచారం చేస్తుండగా.. “మేము సిద్ధమే” అంటూ జనసేన రంగంలోకి దిగింది. విజయవాడ సెంటర్లో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధ ఫెక్సీల వద్ద పోటీగా జనసేన పోస్టర్లను ఏర్పాటు చేసింది. మేము సిద్ధమంటూ బెజవాడలోని పలు కూడళ్లలో జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే తరహా పోస్టర్లను ఎపి అంతటా ఏర్పాటు చేసేందుకు జనసేన సిద్దమవుతన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement