Tuesday, May 14, 2024

AP | ఫ్లైవుడ్ షాపులో మంట‌లు.. నందిగామలో భారీ అగ్ని ప్రమాదం

నందిగామ (ప్రభ న్యూస్‌): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ లో శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఇవ్వాల (బుధవారం) తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ప్రమాదం కారణంగా షాప్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇక.. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్లైవుడ్ షాప్ కావ‌డం వల్ల పూర్తిగా దగ్ధమైంది. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా సుమారు 80లక్షల నుండి కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్‌ నిర్వాహకులు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement