Thursday, May 2, 2024

Gold | విమానం టాయిలెట్స్‌లో 3.2కిలోల‌ బంగారం.. క‌స్ట‌మ్స్ త‌నిఖీల్లో స్వాధీనం!

మాల్దీవులు నుంచి బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో పెద్ద ఎత్తున బంగారం ల‌భించింది. విమానం టాయిలెట్స్‌లోని వాష్‌ బేసిన్‌లో 3.2 కిలోల బంగారాన్ని గుర్తించిన‌ అధికారులు ఆ బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ ఆ బంగారం విలువ దాదాపు రూ.1.8 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మాల్దీవుల నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్లు త‌మ‌కు అందిన‌ విశ్వసనీయ సమాచారం మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అది గుర్తించిన నిందితులు బంగారాన్ని టాయిలెట్స్‌లోని వాష్‌ బేసిన్‌లో ప‌డేసి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తనిఖీ చేస్తూ వచ్చిన అధికారులకు వాష్‌బేసిన్‌లో ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరచి చూడగా అందులో 3.2 కిలోల బంగారం ల‌భించింది. ఇక‌.. అదే విమానంలో బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రయాణికుడే ఆ బంగారాన్ని టాయిలెట్స్‌లో దాచి ఉంటాడని కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. దొరికిన బంగారు బిస్కెట్లను సీజ్‌ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement