Thursday, May 2, 2024

BREAKING : విశాఖ‌లో ఆకాష్‌బైజూస్ విద్యాసంస్థ‌లో అగ్నిప్ర‌మాదం… మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు

విశాఖ‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. గాజువాక‌లోని ఆకాష్‌బైజూస్ విద్యాసంస్థ‌లో ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మూడంతస్తుల భవనంలో చిన్నగా మొదలైన మంటలు.. క్రమంగా అలుముకొని భారీగా వ్యాపించాయి.
కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతు బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్ లు ఉండడం తో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. అయితే, ఓ దశలో మంటలు అదుపులోకి వచ్చినట్టే అనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగసిపడుటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు అలుముకున్నాయి.. బిల్డింగ్ వెనుక భాగంలో నివాస ప్రాంతాలు ఉండటంతో భయబ్రాంతలకు గురవుతున్నారు ప్రజలు.. ఇక, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement