Friday, May 10, 2024

AP | ఎట్టకేలకు పోలీసు ఉద్యోగాలకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌.. కదిలిన నియామక మండలి

అమరావతి, ఆంధ్రప్రభ :పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఉూరట లభించింది. ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఐదు మాసాల తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర పోలీసు నియామక మండలి పచ్చజెండా ఉూపింది. అయితే ముం దుగా ఎస్‌ఐ అభ్యర్ధులకు ఈ శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను రెండో దశ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈనెల 21వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేలా బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పోలీసుశాఖలో మొత్తం 6511 ఉద్యోగాల భర్తీ కోసం జగన్‌ సర్కార్‌ గత ఏడాది నవంబర్‌ 28వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు, అదేవిధంగా 6100 సివిల్‌, రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ (పురుషులు, మహిళలు) పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగింది. ఆయా పోస్టులకు వేర్వేరుగా నిర్వహించిన ప్రాధమిక రాత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో లక్షా 53వేల మంది అభ్యర్ధులు అర్హత సాధించారు.

- Advertisement -

ప్రాధమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు రెండో దశ ప్రక్రియలో భాగంగా దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుగా కానిస్టేబుళ్లకు మార్చి13 నుంచి 20వ తేదీ వరకు షెడ్యూలు ఖరారు చేస్తూ ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో నిలిచిపోయిన ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ప్రక్రియ గత ఐదు మాసాలుగా ఉూసే లేకుండా పోయింది. ఇక ఎస్‌ఐ అభ్యర్ధులక యితే అసలు ఫిట్‌నెస్‌ పరీక్షల షెడ్యూలే ప్రకటించను లేదు. దీంతో పోలీసు ఉద్యోగాలకు ప్రాధమికంగా అర్హత సాధించిన అభ్యర్ధులు ఆందోళనకు సిద్ధమైన నేపధ్యంలో తాజాగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్ధుల్లో ఆనందోత్సాహం వెల్లువెత్తుతోంది.

ముందుగా ఎస్‌ఐ అభ్యర్ధులకు..

అయితే ముందుగా ఫిట్‌నెస్‌ పరీక్షలు ఎస్‌ఐ అభ్యర్ధులకు నిర్వహించాలని పోలీసు నియాకమ మండలి నిర్ణయించింది. 411 ఎస్‌ఐ పోస్టులకు సుమారు లక్షమందికి పైగా దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలోని 13 పట్టణాలు, నగరాలలో 291 పరీక్షా కేంద్రాలలో ఈ ఏడాది పిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన ప్రాధమిక రాత పరీక్షలో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం వీరికి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు తదితర చోట్ల దేహ దారుఢ్య, శరీర సామర్ధ్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు రెండో దశ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ సాంయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచారు.

ఆన్‌లైన్‌ అపి పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిట్‌నెస్‌ ప రీక్షలకు హాజరైన సమయంలో అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆరోజు అభ్యర్థికి సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌, విద్యార్హత, కమ్యూనిటీ, స్దానికత, ఇతర అర్హత ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఓరిజినల్‌ పత్రాలు సమర్పించేందుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండబోదని, అంతా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతుందని, ప్రాధమిక అర్హతకు సంబంధించిన ప త్రాలు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకెళ్లాలని బోర్డు సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, దరఖాస్తు ప్రక్రియ ముగిసిన మీదట ఫిట్‌నెస్‌ పరీక్షకు తేదీలు ప్రకటించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు , సెప్టెంబర్‌లోగా రెండో దశ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement