Monday, April 29, 2024

Faction Attack : కడపలో ఫ్యాక్షన్ పడగ.. ఎస్ఐ అడ్డొచ్చినా ఎమ్మెల్యే అనుచరుడిపై కత్తులు, కొడవళ్లతో దాడి..

ప్రొద్దుటూరు- ప్రభ న్యూస్ : కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీపై హత్యాయత్నం జరిగింది. నగర నడిబొడ్డున గాంధీ రోడ్డులోని మెడినోవా ఆసుపత్రి సర్కిల్ ప్రధాన రోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్సై నర్సయ్యకు కూడా గాయాలయ్యాయి.

ఇవాళ మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు బెనర్జీకి భరత్ వ్యక్తికి ఘర్షణ జరిగింది. ఈ వివాదం కాస్త కత్తిపోట్లకు దారితీసింది. బెనర్జీపై భరత్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఐ నరసయ్యకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన బెనర్జీని గాంధీ రోడ్డులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి చేసిన భరత్ సంఘటన స్థలం నుంచి ద్విచక్ర వాహనంలో పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement