Thursday, May 2, 2024

AP: తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కావాలి.. కే ఏ పాల్

విశాఖ పట్నం.. ఆంధ్ర ప్రభ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కావాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు. ఆశేలమెట్ట ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పలు బీసీ సంఘాలు తమ పార్టీకి మద్దతు ప్రకటించాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో నవంబర్ 9 ఉదయం 10 గంటలకు బీసీ మహాసభ జరుగుతుందన్నారు. ఈ సభలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉబయ గోదావరి జిల్లా బీసీ సంఘాలు పాల్గొంటాయన్నారు.


రాష్ట్రంలో అగ్రవర్ణాల నేతలే సీఎంలు అవుతున్నారని తెలిపారు. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎం పీ గా పోటీ చేస్తానని తెలిపారు. తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నానన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షల మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారన్నారు. ఐదు వేల చర్చిలు వున్నాయన్నారు. పాలన్న రావాలి – పాలన మారాలి అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది నిరుద్యోగులు వున్నారని తెలిపారు.
వీరికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.


తుమ్మిడి బ్రదర్స్ అధినేత రామ్ కుమార్ మాట్లాడుతూ… కే ఏ పాల్ ను విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. బీసీ ఎస్సీ ఎస్టీ లు ఐకమత్యంగా లేనందునే అధికారానికి దూరంగా వున్నారని విచారం వ్యక్తం చేశారు. అనంతరం తుమ్మిడి బ్రదర్స్ అధినేత రామ్ కుమార్, బీసీ నాయకులు ఎస్ఏ రమణ, ఎస్ సీ అప్పారావు, పలువురు మహిళలను పార్టీలోకి ఆహ్వానిస్తూ పాల్ కండువాలు వేశారు. మీడియా సమావేశంలో ప్రజా శాంతి పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement