Monday, April 29, 2024

Nursing Course – బీఎస్సీ నర్సింగ్లో 3500 సీట్లు ఖాళీ – నిబంధనలు సడలించాలంటున్న విద్యార్థులు

భద్రాచలం,అక్టోబర్ 28 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా 3500 నర్సింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్న నిబంధనలు సడలించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. గతంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో, ఇంటర్మీడియట్లో బైపిసి తో వున్న విద్యార్ధుల మార్కులు ప్రామాణికంగా ప్రవేశాలు జరిగాయి. ఈ విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ ద్వారా ప్రవేశాలు పొందేవారు తప్పనిసరిగా ఎంసెట్ లో క్వాలిఫై అయి ఉండాలని, యాజమాన్య కోట సీట్ల కోసం నీట్లో క్వాలిఫై అయి ఉండాలని నిబంధనలు పెట్టారు.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 102 నర్సింగ్ కళాశాలలో ఉన్న 6,500 సీట్లకు గాను 3000 సీట్లు మాత్రమే నిండాయి. నువ్వు చెప్పు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్గడ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశల విషయమై ఆయా రాష్ట్రాలు అర్హత ప్రమాణాలను సదలించగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. ఇంటర్ మార్కులు ప్రామాణికంగా ప్రవేశాలు జరిగితే లబ్ధి పొందేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ చెందిన విద్యార్థులే. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. కొద్దిరోజుల్లో ప్రవేశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ముగింపు పలకనుంది, ఈ క్రమంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచి 3500 మంది విద్యార్థులకు బిఎస్సి నర్సింగ్ అవకాశాన్ని అందించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement