Sunday, April 28, 2024

Exclusive – రాయ‌ల‌సీమలో మైనార్టీల మొగ్గు ఎటు…

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్‌ బ్యూరో) : నాలుగైదు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో మైనారిటీ- ఓట్ల మొగ్గు ఎటు-వైపు అనే అంశం చర్చనీయాంశమ వుతోంది. మొత్తం 8 జిల్లాల్లో గత ఎన్నికలలో 7 శాతంవరకు మైనారిటీల ఓట్లున్నాయి. ప్రస్తుతం మైనారిటీ- ఓట్ల శాతం 8కి పెరిగింది. ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రతి ఓటు- విలు వైనదిగా భావించే ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో మైనారి టీ- ఓట్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలుపెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తరువాత ముస్లిం మైనారిటీ- ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా రాయలసీమ. గత ఆరు దశాబ్దాల మధ్యకాలంలో వేళ్ళపై లెక్కకట్టగలిగే సంఖ్యలోనే నాయకులు గా ఎదిగినవారు కనిపిస్తారు. కనుకనే రాయలసీమ రాజకీయ చరిత్ర పుట ల్లో సైఫుల్లా బేగ్‌, ఫరూక్‌, గఫూర్‌, అంజాద్‌ బాషావంటి కొంతమంది మాత్రమే కనిపిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయలసీమ జిల్లాల్లో 11 శాతం వరకు ముస్లిం మైనారిటీ- జనాభా ఉన్నా 2014 ఓటర్ల జాబితా ప్రకారం దాదాపు ఆరు శాతం శాతమే ఉన్నట్లు తేలింది.

2019 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 7 శాతానికి పెరగగా ప్రస్తుతం దాదాపు 8 శాతానికి పెరిగినట్టు- ప్రధాన రాజకీయ పక్షాల అంచనా వేస్తున్నాయి. మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగైదు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉండగా మరో మూడు నాలుగు స్థానాల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. 60 ఏళ్ల నుంచి 2019 ఎన్నికల వరకు రాయలసీమ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే వివిధ పార్టీల తరపున ముస్లిం అభ్యర్థులు ఉమ్మడి కడప జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి 13 సార్లు పోటీ- చేసి 8 సార్లు, ఉమ్మడి కర్నూల్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి 18 సార్లు పోటీ- చేసి 8 సార్లు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి 13 సార్లు పోటీ- చేసి నాలుగు సార్లు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు నియో జకవర్గాల నుంచి 9 సార్లు పోటీ- చేసి 4 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌లో బలంగా ఉన్న ఎంఐఎం రాయలసీమ జిల్లాల్లోని రాయచోటి, నంద్యాల, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, కదిరి, మదనపల్లె స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులకు పోటీ-లో దించింది.

ఆ ఎన్నికల్లో ఒక్క రాయచోటిలో మాత్రం 2,054 ఓట్లు- లభించిన కాంగ్రెస్‌ అభ్యర్థికన్నా ఎక్కువగా ఎంఐఎం అభ్యర్థికి 2,764 ఓట్లు- లభించాయి, మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పోటీ- చేసిన ఎం.ఐ.ఎం అభ్యర్థులకు ఆదోనిలో 1,833, హిందూపురంలో 975 చొప్పున ఓట్లు- రాగా ఇతర అయిదు చోట్ల మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఓట్లు- లభించాయి, ఫలితంగా 2019 ఎన్నికల్లో ఎం ఐఎం సీమ జిల్లాలో పోటీ- చేయలేదు. పై రెండు ఎన్నికల్లో ఇతరపార్టీలకన్నా ఎక్కువగా ముస్లిం మైనారిటీ-లకు టిక్కెట్లు- ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మాత్రం డిపాజిట్‌లు కూడా దక్కకపోవడం గమనార్హం.
ఇక ఏ రాజకీయ పార్టీకి రాయలసీమ ముస్లిం ఓటర్ల మొగ్గు అనే అంశానికి వస్తే తొలినుంచి అత్యధిక శాతం కాంగ్రెస్‌ పార్టీ కి, ఇటీ-వలి కాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే కనిపిస్తుంది, ఇక తెలుగుదేశం పార్టీ విష యానికి వస్తే ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికన్నా లేనప్పుడే కొంతమేరకు మొగ్గు కనిపించేది. 2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ- చేసిన తమకు ఓట్లు-వేయకపోవడంతో 2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తరువాత 2019 ఎన్నికల ప్రచారంలో ఆ విషయాన్ని ఓటర్లకు చెప్పుకోడానికి తెలుగుదేశం ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ముందుగా చెప్పినట్టు-గా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి వెను బలంగా ఉన్న మైనారిటీ- ఓటర్లలో అత్యధిక శాతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపించారు. దీనికి తగినట్టు-గానే 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్క మైనారిటీ- అభ్యర్థికి కూడా టికెట్‌ ఇవ్వకపోగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప, కదిరి నియోజకవర్గాల్లో మైనారిటీ- అభ్యర్థులను పోటీ- చేశారు 2019 ఎన్నికల విషయానికి వస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప, కర్నూల్‌, మదనపల్లె, హిందూపూర్‌ స్థానాలలో మైనారిటీ- అభ్యర్థులను పోటీ- చేయగా తెలుగుదేశం పార్టీ ఒక్క కడపలో మాత్రం మైనారిటీ- అభ్యర్థికి టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో 4 చోట్ల పోటీ- చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులలో ముగ్గురు విజయం సాధించారు.

- Advertisement -

ఈ నేపధ్యంలో దాదాపు 8 శాతం ఉండనే ప్రచారం జరుగుతున్న ముస్లిం మైనారిటీ- ఓట్ల కోసం ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఆకట్టు-కునే చర్యలు ప్రారంభించారు. అందుకు తగినవిధంగానే 8 రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లొ ప్రధాన పార్టీల టిక్కెట్ల కోసం పోటీ- పడుతున్నవారిలో ముస్లిం మైనారిటీ- అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. పలు రకాల సమీకరణల నడుమ మరో రెండునెలల్లో ఊపందుకోనున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లో ఏ పార్టీ ఎంతమంది మైనారిటీ-లకు టిక్కెట్లు- ఇస్తుందో, మైనారిటీ- ఓట్ల కోసం ఏ పార్టీ ఎటు-వంటి తాయిలాలు ప్రకటిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement