Monday, April 29, 2024

Congress Bus Tour – నేడు రాహూల్, ప్రియాంకా గాంధీల రాక – రామప్పలో బస్సు యాత్రను ప్రారంభించనున్న అగ్ర నేతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. గెలుపు అజెండాతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీ- స్కీంల ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్‌.. బస్సు యాత్రలతో ఆ జోరు మరింత పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతోంది. ఈ యాత్రలో పార్టీ జాతీయ నేతలు, పార్టీ కీలక నేతలు పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నుంచి మూడు రోజులపాటు- బస్సుయాత్రలు నిర్వహించనుంది. తొలి రోజున రామప్ప దేయాలయంలో శివుడికి ప్రత్యేక పూజల అనంతరం బస్సుయాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామానుజపురంలో మహిళలతో ఏర్పాటు- చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌, ప్రియాంకగాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. అనంతరం ములుగు పట్టణం నుంచి భూపాలపల్లి వరకూ 35 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత భూపాలపల్లిలో పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతతో కలిసి వారి సమస్యలపై నేతలు ఆరా తీయనున్నారు. మొదటి రోజు యాత్ర ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.


రెండో రోజు..
గురువారం రెండవ రోజు యాత్రలో రామగుండం నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. అక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మిక సంఘాల నేతలతోపాటు- కాంట్రాక్ట్‌ కార్మికులతో సమావేశమై.. వారి సమస్యలను రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకోనున్నారు. ఈ భేటీ- అనంతరం రామగుండం నుంచి పెద్దపల్లి వరకూ 30 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో రైతులు ఎదుర్కొంటు-న్న సమస్యలు, గిట్టు-బాటు- ధరలు, అన్నదాతల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రైతులు చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటి అంశాలపై ప్రసంగించనున్నారు. తర్వాత పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వరకూ రాహుల్‌ గాంధీ 35 కిలోమీటర్ల మేర జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం కరీంనగర్‌లో గంటపాటు- పాదయాత్ర చేపట్టి వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించనున్నారు.


శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న రాహుల్‌
యాత్రలో భాగంగా మూడవ రోజు శుక్రవారం బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌లలో రాహుల్‌ గాంధీ పర్యటిస్తారు. బోధన్‌ డివిజన్‌లో బీడీ కార్మికులు, గల్ఫ్‌ వలస కార్మిక కుటు-ంబాలతో ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం బోధన్‌ నుంచి ఆర్మూర్‌ వరకూ 50 కిలోమీటర్ల మేర బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆర్మూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించడం తోపాటు-.. పసుపు, చెరుకు రైతులను కలిసి వారి సమస్యలపై ఆరా తీయనున్నారు. అనంతరం ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ వరకూ 25 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నిజామాబాద్‌లో పాదయాత్రతో మూడు రోజుల బస్సుయాత్ర ముగియనుంది. జాతీయ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో బస్సుయాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు- చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement