Sunday, April 28, 2024

AP : విద్యావేత్త వెంకటరత్నం ఇక లేరు…

ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్ధకు గురై కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

విద్యారంగంలో చెరగని ముద్రవేసిన ఆయన విద్యాసంస్థల విజయాలకు నెలవుగా నెల్లూరు జిల్లా కీర్తిని ఇనుమడింప చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఏపీలోనే తొలిసారిగా కోచింగ్‌ సెంటర్లను నెల్లూరులో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. పేద విద్యార్థులకు తమ సంస్థల్లో ఉచితంగా కోర్సులు అందించారు. గుండో సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సొంత డబ్బుతో ఆపరేషన్లు చేయించారు. వెంకటరత్నం శిష్యులు ఎందరో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఇవాళ వెంకటరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఓవైపు విద్యనందిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టారు. 2005లో చిన్నారి హార్ట్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి 140మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి అందరి మన్ననలు పొందారు. కేవీ రత్నం మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement