Thursday, May 2, 2024

National : చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్… అరుణ‌చ‌ల్​ప్రదేశ్​ భార‌త్‌దే…

అరుణాచల్ ప్రదేశ్‌ మాదేనంటూ చైనా ప్రకటన నేపథ్యంలో అమెరికా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.

ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సైన్యాలను సరిహద్దులకు తరలించేందుకు సర్వకాలాల్లోనూ అందుబాటులో ఉండే ఈ టన్నెల్‌కు భద్రతాకారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా తమ భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది.

- Advertisement -

మరోవైపు, చైనా ప్రకటనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement