Sunday, April 28, 2024

విశాఖ‌లో తొలి ఈసీబీసీ భ‌వ‌నం……..

అమరావతి, ఆంధ్రప్రభ:ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్ధ్యవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రగతిశీల ప్రయత్నాలు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఒక మణిమానిక్యాన్ని తీసుకురానున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఇంధన సామర్ధ్య రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కిం చుకున్న ఏపీకి మరో దేశ స్థాయి గుర్తింపు లభించింది. ఈసారి కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ విశాఖపట్నంలో మోడల్‌ సూపర్‌ ఈసీబీసీ (ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌) భవనాన్ని నిర్మించడానికి అంగీకరించింది. ఇందుకోసం ఇంధన శాఖ ఆధ్వర్యంలోని స్టేట్‌ డిజిగ్నే-టె-డ్‌ ఏజెన్సీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)కు ఆర్థిక సహాయం అందించింది. ఈసీబీసీ ఆధారిత భవనాల కంటే ఈ సూపర్‌ ఈసీబీసీ భవవనం 30 నుండి 40 శాతం ఎక్కువ సమర్థవంతమైనదిగా ఉండబోతోంది. పునరుత్పాదక ఇంధనంతో కూడిన ఈ భవనాలు నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్‌గా నిలవనున్నాయి. ఈసూపర్‌ ఈసీబీసీ భవనాలు కొత్త వాణిజ్య భవనాల నిర్మాణం కోసం ఎంపికచేయనున్నారు. ఇవి దాదా పు సున్నా ఇంధన వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్మితం కానున్నాయి. సాధారణ ఈసీబీసీ భవనాల కంటే ఇవి మరింత సమర్థవంతంగా ఉండనున్నాయి. ఈసీబీసీ భవ నాలు 25 శాతం తక్కువ విద్యుత్‌ని తీసుకుంటే సూపర్‌ ఈసీబీసీ భవనాలు 50 శాతం తక్కువ విద్యుత్‌ని తీసుకుం టాయి. ఆన్‌-సైట్‌లో పునరుత్పాదక ఇంధనాన్ని జోడించ డంతో, సూపర్‌ ఈసీబీసీ భవనాలు ఇంధన వినియోగంలో నికర సున్నాగా కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

సాలీనా 7 శాతం పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం
రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 7 శాతం మేర ఇంధన డిమాండ్‌ పెరుగుతోంది. ఇంధన డిమాండ్‌ పెరుగుదలలో భవనాల రంగం ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈక్రమంలో గణనీయమైన ఇంధన పొదుపు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చేయడంతోపాటు- ఇంధన వ్యయం మరియు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యల్లో భాగంగా భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలు చేయడం జరుగుతోంది.

రూ. 3,800 కోట్ల విలువైన 5,600 ఎంయూ విద్యుత్‌ ఆదా
ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం రాష్ట్రానికి రూ.3800 కోట్ల విలువైన 5,600 మిలియన్‌ యూనిట్ల (ఎం యూ) విలువైన ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయ పడి నందుకు బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఎస్‌ఈసీఎం అధికారులతో భవన నిర్మాణ రంగం యొక్క ఇంధన సామర్థ్య కార్యకలాపాలపై బీఈఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం గరిష్ట ప్ర యత్నా లు చేస్తుందని చెప్పారు. మార్చి-2023లో వైజాగ్‌లో జరగను న్న జీ-20 సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ- సమా వేశం దృ ష్ట్యా, విశాఖపట్నంలో సూపర్‌ ఈసీబీసీ భవన నిర్మాణంలో రాష్ట్రానికి మద్దతు ఇవ్వడానికి బీఈఈ నిర్ణయం మ రింత ప్రా ముఖ్యతను సంతరించుకు-ందని తెలిపారు. సూపర్‌ ఇసి బిసి-2017 నిబంధనలకు అనుగుణంగా జి ప్లస్‌ 1 అంత స్తుల తో కూడిన -టైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ భవనాన్ని నిర్మిం చం దుకు ఎపిఇపిడిసిఎల్‌కు బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ జారీ చేయా లని వి శాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ పి రాజాబాబును కోరారు.

9 నెలలో పూర్తి
విశాఖలో నిర్మితం కానున్న ఈ సూపర్‌ ఈసీబీసీ బిల్డింగ్‌ను 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈసూపర్‌ ఈసీబీసీ భవన నిర్మాణ పనులపై ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కే సంతోషరావు, ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్లు డీ చంద్రం, బీ రమేష్‌ ప్రసాద్‌, ఏవీవీ సూర్యప్రతాప్‌ ప్రత్యేక సీఎస్‌కు వివరించారు. రాష్ట్ర భవన నిర్మాణ రంగంలో చేపట్టిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలను సీఈవో ఏపీఎస్‌ఈసీఎం ఏ చంద్రశేఖర రెడ్డి వివరిస్తూ న్యాయశాఖ ఆధ్వర్యంలో 541 కోర్టు భవనాలు, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 మోడల్‌ స్కూళ్లు, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రధాన ఆస్పత్రిలో అనేక ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేశామని తెలిపారు. ఏఎస్‌సీఐ (ఆస్కీ) నివేదిక ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్యాలయ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా సుమారు రూ.500 కోట్ల విలువైన 800 మిలియన్‌ యూనిట్లను ఆదా చేసే అవకాశం ఉందని చెప్పారు.

- Advertisement -

ఎంపిక అందుకే..
ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, నిబద్ధతను గుర్తించి బీఈఈ ప్రశంసించింది. ఇంధన వ్యయ ప్రయోజనాలను ప్రదర్శించగల సూపర్‌ ఈసీబీసీ భవనాల ప్రదర్శన కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల్రతో పాటు- ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. అందులో భాగంగా అన్ని అత్యాధునిక సాంకేతికతలతో కూడిన సూపర్‌ ఇసిబిసి భవనాన్ని విశాఖపట్నంలో నిర్మిస్తుంది, ఇది మొత్తం దేశానికి ఇంధన సామర్థ్య భవనాల ప్రయోజనాలను ప్రదర్శించగల ఉత్తమ నమూనా ప్రదర్శన భవనం అవుతుందని ఎపి ఇంధన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement