Tuesday, May 7, 2024

రైతులకు న్యాయం చేయాలి…ఎమ్మెల్యే వేగుళ్ళ…

మండపేట : తుఫాను ప్రభావంతో గత నాలుగు, ఐదు రోజులుగా కురుసిన వర్షల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లటం చాలా భాదాకరమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాడ్లాడుతూ.. పంట చేతికి అందుతున్న వేళ అధిక వర్షాలు, ఈదురు గాలుల వల్ల వరి చేలు పూర్తిగా నేల అంటాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు, ఇన్ పుట్ సబ్సిడి ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సూచించారు. ఈ అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరి నీటిలో నాని మొలకలు రావడం, పంట కుళ్లిపోయిందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటకోత ప్రయోగం ద్వారా ప్రతీ రైతుకు నూటికి నూరు శాతం క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలని ఈ సంధర్బంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement