Wednesday, May 8, 2024

గణిత మేధావికి డాక్టరేట్ ప్రదానం…

కృష్ణాయూనివర్సిటీలో గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (అడ్ హాక్ ) గా పని చేస్తున్న కళ్లేపల్లి నరసింహ స్వామికి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఘంటసాల మండలం చినకళ్ళేపల్లిలో అతి సాధారణ పేద కుటుంబంలో జన్మించిన నరసింహస్వామి విద్యలో ఉన్నత ఫలితాలు సాధించి జూనియర్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుడుగా విస్తృత నైపుణ్యం పొంది డాక్టరేట్ ను పొందటంపై అధ్యాపకులు విద్యార్థులు సైతం అభినందనలు తెలుపుతున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం అనుభంద ఆర్.వి.ఆర్.జే.సి కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె.రాజశేఖర్ పర్యవేక్షణ లో “హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ ఆన్ ఎం హెచ్ డి ఫ్రీ కన్వీక్టివ్ ఫ్లో పాస్ట్ ఫిక్స్డ్ అండ్ మూవింగ్ బౌండరీస్ ” అనే అంశంపై చేసిన పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఈ డాక్టరేట్ యూ ప్రధానం చేసింది.

ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన నరసింహ స్వామి మాట్లాడుతూ తనకు డాక్టరేట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కె.రాజశేఖర్, కెఎల్యూ ప్రొఫెసర్ సి.హెచ్.వి.రమణమూర్తిలు తమ విలువైన సమయాన్ని తనకు కేటాయించి శిక్షణకు ఎంతో సహకరించారని, వారి కృషి కారణంగానే తన ప్రతిభకు ఇంతటి గుర్తింపు లభించిన దని వారిరువురికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పి.హెచ్.డి రావడం తనకు ఎంతో సంతృప్తిని కల్గించిందని తనకు లభించిన ఈ గుర్తింపును పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగిస్తానని నరసింహస్వామి మీడియాకు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement