Friday, March 29, 2024

మ‌ధురై అవ‌నీయ‌పురంలో జ‌ల్లిక‌ట్టు – 48మందికి గాయాలు

క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ మేర‌కు పుదుకోట్టై జిల్లాలోని త‌చ్చంకురిచ్చిలో జ‌ల్లిక‌ట్టు పోటీలు ప్రారంభించారు. కాగా ఈ పోటీల్లో 600ఎద్దుల‌ను ప్ర‌వేశ‌మార్గం ద్వారా వ‌దిలారు. అయితే 300మంది యువ‌కులు ఎద్దుల‌ను అదుపుచేసేందుకు ఉత్సాహ‌ప‌డ్డారు. కాగా కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారికే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే జల్లికట్టు పోటీలను నిర్ణీత సమయం కన్నా గంట సేపు అధికంగా నిర్వహించడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎద్దుల యజమానులు వాడివాసల్ నుంచి ఎద్దులను ఇష్టానుసారంగా బయటకు వదిలారు. దీంతో ఎద్దులు రంకెలేస్తూ జనం వైపు దూసుకెళ్లాయి. దీంతో ఒకరిద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

మధురై అవనీయపురంలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. పోట్లగిత్తల్ని లొంగదీసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడ్డారు. ఇక్కడ పోటీల్లో 500 ఎద్దులు బరిలో నిలవగా.. 300 మంది యువకులు ఎద్దులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఈ పోటీల్లో భాగంగా 48 మంది గాయాలు అయినట్టుగా ఓ వైద్యాధికారి తెలిపినట్టుగా ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement