Monday, April 29, 2024

ఒక్క ఫోన్ కాల్ తో ఇంటివద్దకే డాక్టర్.. సీఎం జగన్

ఒక్క ఫోన్ కాలతో ఇంటివద్దకే డాక్టర్ వస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ పథకం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిపోతుందన్నారు. విలేజ్ క్లీనిక్ లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటే వైయస్‌ఆర్‌ గుర్తకొస్తారని, ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. పేదలు ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని, మీ గ్రామానికే, సమీపానికే అన్ని వైద్యసేవలు అందించే గొప్ప కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అన్నారు. ఈ విధానంలో  సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు.

ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా తొలి దశలోనే కనుగొని వెంటనే వైద్యం అందిస్తామన్నారు. వ్యాధి ముదరకుండా కాపాడుతామన్నారు. క్యాన్సర్‌ మొదలు టీబీ దాకా ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రం ఈ విధానంతో మొదలవుతుందన్నారు.
ప్రతి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని మొదలుపెడుతున్నామన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదన్నారు. గ్రామంలో ప్రతి రోగిని డాక్టర్‌ పేరు పెట్టి పిలిచేంతగా ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. మ‌నంద‌రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుందన్నారు. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement