Saturday, April 27, 2024

విపత్తులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ: సీఎస్‌ సమీర్‌ శర్మ

అమరావతి, ఆంధ్రప్రభ: కమ్యునిటీ- భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయలో సీఎస్‌ అధ్యక్షతన విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రిపేర్డ్నెస్‌ మరియు కెపాసిటీ- బిల్డింగ్‌ కు సంబంధించి 6వ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ- సమావేశం జరిగింది. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా ప్రిపేర్డ్‌ నెస్‌ మరియు కెపాసిటీ- బిల్డింగ్‌కు సంబంధించి వివిధ శాఖలకు అవసరమైన నిధులు మంజూరుపై ఈసమావేశంలో చర్చించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డా.బిఆర్‌.అంబేద్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విపత్తుల నిర్వహణ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి 10 శాఖలకు సంబంధించి సుమారు 73 కోట్ల 74 లక్షల రూ.ల ప్రతిపాదనలు అందాయని సీఎస్‌కు వివరించారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ మాట్లాడుతూ కమ్యునిటీ- భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలకు అవసరమైన పరికరాలు కొనుగోలుతోపాటు- సన్నద్ధత,కెపాసిటీ- బిల్డింగ్‌ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల వారీ వచ్చిన ప్రతిపాదనలపై సిసిఎల్‌ఏ మరియు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,హెచ్‌ఆర్డిఏ అదనపు డైరెక్టర్‌ జనరల్‌,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ లతో ఒక కమిటీ-ని ఏర్పాటు- చేస్తున్నట్టు- సిఎస్‌ చెప్పారు. ఈకమిటీ- ఒకసారి కూర్చొని ప్రతిపాదనలను సమీక్షించి ఆయా శాఖలవారీ అవసరాల మేరకు నిధుల ఆవశ్యకతను గుర్తించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆప్రకారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని సిఎస్‌ డా.సమీర్‌ శర్మ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement