Friday, April 26, 2024

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిటల్‌ స్టాంప్స్‌.. అవినీతికి చెక్​పెట్టేందుకు చర్యలు..

అమరావతి, అంధ్రప్రభ: రిజిస్ట్రేష్రన్స్‌ శాఖలో డిజిటల్‌ స్టాంప్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇటీవల ఈ శాఖ పరిధిలో జరిగిన భారీ చలాన్ల కుంభకోణంలో మోసగాళ్లు సాప్ట్‌వేర్‌లోని లొసుగులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ స్టాంప్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్‌ పరంగా మాన్యువల్‌ స్టాంపులు ఉండాలనే సెంటిమెంట్‌ కూడా ఉంది. అందుకే గతంలో కూడా ప్రభుత్వం ఈ-డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చినప్పటికీ విజయవంతం కాలేదు. ఎన్నో మార్పులుఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో నాలుగు పద్ధతుల్లో స్టాంపుల విధానం అమల్లో ఉంది. పూర్వంజి 1990వ దశకం వరకు స్పెషల్‌ ఎడిషన్‌ స్టాంప్స్‌ను ఎక్కువగా వినియోగించేవారు. పాత రోజుల్లో బ్యాంకులో చలానాలు కట్టే విధానం లేదు కాబట్టి స్టాంపు డ్యూటీ ఎంత ఉంటే అంతకు స్టాంపులు కొనాల్సి ఉండేది. ఒకవేళ అంత పరిమాణంలో స్టాంపులు లేకపోతే స్పెషల్‌ ఎడిషన్‌ స్టాంపులు ఉపయోగించేవారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆ విలువకు తగ్గట్టు ఆ మొత్తంతో ఉండే సింగిల్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్టాంపులను జారీ చేశారు. తెల్గీ కుంభకోణం తర్వాత స్పెషల్‌ ఎడిషన్‌ స్టాంపుల జారీలో కొన్ని పరిమితులను విధించారు. ఇక రెండో కేటగిరీ జ్యుడీషియరీ స్టాంప్స్‌.. వీటిని మనం తోక బిళ్ల స్టాంపులు అంటాం. రూ.10. రూ.20. రూ.50, రూ.100 ఇలా ఉంటాయి. వీటిని పెద్దగా ఏ పార్టీలూ ఉపయోగించటం లేదు. మూడవ రకం నాన్‌ జ్యుడీషియరీ స్టాంప్స్‌.. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లన్నీ వీటిద్వారానే నడుస్తున్నాయి.

ఈ స్టాంప్స్‌ పార్టీలకు సెంటిమెంట్‌. కాబట్టి వీటికి ఎక్కువ డిమాండ్‌ ఉంటు-ంది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీలను బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 నాన్‌ జ్యుడీషియరీ స్టాంపులను డాక్యుమెంట్లు రాసుకోవటానికి ఉపయోగిస్తున్నారు. నాల్గవది ఫ్రాంక్లింగ్‌ స్టాంప్స్‌. వీటిని మార్ట్‌గేజ్‌కు ఉపయోగిస్తారు. బ్యాంకులు ఎక్కువగా ఈ స్టాంప్‌ల మీద ఆధారపడతాయి. గృహరుణాలు ఇచ్చినపుడు రుణ పరిమితి తీరే వరకు ఆ గృహం మార్ట్‌గేజ్‌లో ఉంటుంది. దాని విలువను బట్టి 0.5 శాతం మేర ఫ్రాంక్లింగ్‌ స్టాంప్‌ల మీద సంతకాలు చేయించుకుంటారు. ఫైనాన్స్‌ సంస్థలు కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అనుమతులు తీసుకుని ఫ్ల్రాంక్లింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి చట్టబద్ధమైనవి. ఒకవేళ డబ్బు కట్టకపోయినా.. ఆయా ఆర్థిక సంస్థలు కోర్టుకు వెళ్ళి జప్తు చేసుకోవటానికి ఈ స్టాంప్‌లు పరోక్షంగా దోహదపడతాయి.

ఈ స్టాంప్‌లను కొంతకాలం క్రితం రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రవేశపెట్టింది. అయితే వీటిలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్టాంప్‌ను తీసుకుని ఉపయోగించకుంటే.. రద్దు చేసుకోవటం చాలా కష్టం. దీనిని రద్దు చేసుకుని డబ్బులు వాపసు పొందటానికి ప్రభుత్వ జీవోలు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్‌ శాఖ వాటిని అమలు చేయటం లేదు. ఫలితంగా ఎన్నో దరఖాస్తులు ఇలాంటివి రిజిస్ట్రేషన్‌ శాఖ దగ్గర అపరిష్కృతంగా ఉంటున్నాయి. జిల్లా రిజిస్ట్రార్‌, డీఐజీ స్థాయి అధికారుల చేతిలో సమస్య పరిష్కారం ఉన్నా.. ఐజీ ఆఫీసుకు పంపుతున్నారు. అక్కడ కూడా పరిష్కారం తేలటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డిజిటల్‌ స్టాంప్‌లను తీసుకువస్తున్నట్లు సమాచారం.

నూతన విధానంలో డిజిటల్‌ స్టాంప్స్‌..

నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం. ప్రైవేటు సంస్థను తీసుకు వచ్చే బదులు రిజిస్ట్రేషన్స్‌ శాఖలోనే ఓ ఐటీ విభాగాన్ని, కొన్ని సాప్ట్‌వేర్‌ పోస్టులను సృష్టించి, వారి పర్యవేక్షణలో డిజిటల్‌ స్టాంప్స్‌ కార్యకలాపాలు జరిపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెంటాడుతున్న రవాణా స్కాం అనుభవాలుకొద్దిరోజుల క్రితం రవాణా శాఖలో సాప్ట్‌వేర్‌ వ్యవహారాలను పర్యవే క్షించే ప్రైవేటు సంస్థ సిబ్బంది జాతీయస్థాయి కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ శాఖ సాప్ట్‌nవేర్‌ కూడా ఇటువంటిదే. అయితే స్టాంపులు వినియోగదారులకు ఫ్రెండ్లీగా ఉండాలే తప్ప ఇబ్బందులు పెట్టే విధంగా ఉండకూడదు. అంతకు మించి ఇవి దుర్వినియోగం అయితే వినియోగదారులే నష్టపోతారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement