Friday, October 11, 2024

Breaking: ఆర్డీవో శంకర్ కుమార్​పై మ‌రో కేసు.. అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ

పెద్దపల్లి ఆర్డీవోగా పనిచేసిన శంకర్ కుమార్ పై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఆర్డీవోగా పని చేస్తూ గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ గా ఉన్న సమయంలో కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడగా కేసు నమోదు చేసి శంకర్ కుమార్ ను జైలుకు పంపిన విషయం విదితమే.

అనంతరం శంకర్ కుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ జరపగా 92 లక్షల రూపాయల అక్రమ ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు శంకర్ కుమార్ అందించక పోవడంతో ఏసీబీ మంగళవారం తాజాగా ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో మరో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement