Friday, May 3, 2024

MLA: ఆ ముగ్గురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి.. ఆనం

టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారని.. ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించండని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ కు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. ఇంకా ఏడాది అధికారం ఉన్నా వద్దని బయటకు వచ్చామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

మొదట ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి… తర్వాత మమ్మల్ని అడగండని విమర్శలు చేశారు. తాను గతంలో నెల్లూరు.. రాపూరు.. ఆత్మకూరు.. వెంకటగిరి ల నుంచి పోటీ చేశానని.. ఆరు సారు ఎమ్మెల్యేగా గెలిచా.. కొన్నిసార్లు ఓడిపోయానని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని.. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement